సైరా .. షూటింగ్ షురూ


చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రాత్మక కథా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. చిత్రంలోని ఓ కీలకమైన పోరాట ఎపిసోడ్ చిత్రీకరణతో ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకమైన భారీ సెట్‌ ను తీర్చిదిద్దారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణకు హాలీవుడ్‌కి చెందిన స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ లీ విట్టేకర్‌ నేతృత్వం వహిస్తున్నారు. బుధవారం మొదలైన ఈ షెడ్యూల్ 22 వరకు జరుగుతుంది. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుంటే కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార ఎంపికైంది. మరో ఇద్దరు నటీమణుల ఎంపిక జరగాల్సి ఉంది. అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ముఖ్యాంశాలు