ఇండియా, చైనా ఒక డ్రోన్!


చైనా గగనతలంలోకి భారత డ్రోన్‌ వెళ్లిన విషయంలో భారత రక్షణశాఖ స్పందించింది. అది నిజమేనని, సాంకేతిక కారణాల వల్లే అలా జరిగిందని పేర్కొంది. సాధారణ శిక్షణలో ఉన్న భారత్‌కు చెందిన మానవరహిత వైమానిక వాహనం(యూఏవీ) ఇటీవల సాంకేతిక కారణాల వల్ల గ్రౌండ్‌ కంట్రోల్‌ విభాగంతో సంబంధాలు కోల్పోయి సిక్కిం సెక్టార్‌ వద్ద వాస్తవాధీన రేఖను దాటిందని రక్షణశాఖ వెల్లడించింది. అయితే భారత సరిహద్దు భద్రతా సిబ్బంది దీనిపై తక్షణమే చైనా దళాలకు సమాచారం పంపి యూఏవీ ఎక్కడుందో గుర్తించాలని కోరిందని పేర్కొంది. చైనా అధికారులు కూడా స్పందించి సంబంధిత వివరాలను పంపారని తెలిపింది. భారత్‌కు చెందిన ఒక డ్రోన్‌ తమ గగనతలంలోకి వచ్చిందని చైనా అధికారిక మీడియా బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం