ఎర్ర చందనం దుంగల స్వాధీనం

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం తీండ్రగుంట అటవీప్రాంతంలో ఎర్రచందనం దొంగలు రెచ్చిపోయారు.  అక్రమంగా తరలించేందుకు వచ్చిన 150 మంది కూలీలను 70 మంది టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది చుట్టుముట్టారు. కూలీలు ప్రతిఘటించడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో తీండ్రగుంట అటవీప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కోడూరు, తిరుపతి వైపు నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కూలీలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐజీ కాంతారావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. 150 ఎర్రచందనం దుంగలను  స్వాధీనం చేసుకున్నారు.

Facebook
Twitter