జపాన్ బృందంతో నారా లోకేష్ చర్చలు


అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌కు చెందిన కుని ఉమి ఎస్పెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేశ్‌ గురువారం సమావేశమయ్యారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో తరలించగలిగే పెవిలియన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం, ఐటీ స్పేస్‌ నిర్మాణం, నెస్ట్స్‌ జనరేషన్‌ ఆటో ఎలెక్టిక్‌ వెహికిల్‌ మోడల్‌ సిటీ నిర్మాణానికి ఈ సంస్థ ముందుకొచ్చినట్లు సమాచారం. ఆధునాతన వసతులు, మౌలిక వసతులతో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని లోకేశ్‌ వారికి తెలిపారు.గృహ సదుపాయంతో కూడిన ఐటీ పార్కుల అభివృద్ధి కోసం ఐఐటీ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు.

</