పోలవరం గురించి ఏమీ తెలియదు - పవన్

పోలవరం ప్రాజెక్టుపై తనకు అవగాహన లేదని, అందుకే దాని గురించి తెలుసుకోవాలని వచ్చానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆయన గురువారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన కాటన్‌ కాలంలో చేసినా ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదన్నారు. ఈ ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో లేక పార్టీదో కాదన్నారు. నిర్మాణం జాప్యం జరిగే కొద్దీ వ్యయం విపరీతంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Facebook
Twitter