బుద్ధి మారని చైనా.. అదే తీరు


భారత్ పట్ల చైనా అకారణ వైరం ప్రదర్శిస్తూనే ఉంది. న్యూక్లియర్‌ సప్లయిర్స్‌ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వానికి మద్దతిచ్చేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి చైనా మద్దతు కూడగట్టేందుకు రష్యా కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చైనా మద్దతు నిరాకరించిన విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ రబాబ్కోవ్‌ తెలిపారు. ఈ విషయంపై చైనాతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ప్రకటించేది లేదని చైనా తేల్చి చెప్పిందని, భారత్‌ అణ్వస్త్ర నిరోధక చట్టంపై సంతకం చేశాక మాత్రమే తమ ఆలోచన మారుతుం‍దని చైనా ప్రకటించిందని చెప్పారు. కాగా ఎన్‌ఎస్‌జీ సభ్యదేశాల్లో ఒక్క చైనా మినహా మిగిలిన 47 దేశాలు భారత్‌కు అనుకూలమని ఇదివరకే ప్రకటించాయి. ఈ విషయంలో భారత్‌ను పాక్తో పోల్చి చూడవద్దని, మద్దతు ఇవ్వాలని రష్యా పదేపదే చైనాకు చెబుతున్నా వినడంలేదు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం