ముసద్దీలాల్ కి మూడింది..


గత సంవత్సరం నవంబర్ 8 న పెద్ద నోట్ల రద్దు తర్వాత గంటల వ్యవధిలోనే 5 వేల మంది తమ దుకాణాలకు వచ్చి ఏకంగా 340 కిలోల బంగారం కొన్నట్టు చూపి నకిలీ బిల్లులు సృష్టించి కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ చేసిన ముసద్దీలాల్ (హైదరాబాద్) నగల దుకాణం వ్యవహారం గుర్తుంది కదా... రూ.97.85 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్‌లో పక్కా ఆధారాలు సేకరించిన హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్‌) అభియోపత్రాలు దాఖలు చేసింది. కేసులో మొత్తం పది మంది నిందితులతో పాటు మూడు కంపెనీలపై చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి బుధవారం వెల్లడించారు. రూ.97.85 కోట్ల నగదు మొత్తం ముసద్దీలాల్‌ యాజమాన్యానిదే అని నిర్ధారణ అయింది. పెద్ద నోట్ల రద్దు వలన అక్రమార్కుల బండారాలు భారీగానే బట్టబయలవుతున్నాయి. ఆ రోజుల్లో సామాన్యులు ఏటీఎం ల వద్ద పడిగాపులు కాసిన దానికి సార్థకత ఇలాంటి ద్రోహులు పట్టుబడడం. ఇలాంటి అక్రమార్కులు ఇంకా చాలామంది ఉన్నారు... కొందరైతే పట్టుబడ్డారు. ఇంకా తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. చాలా మందికి ఈసరికే నోటీసులు వెళ్లాయి. దర్యాప్తులు జరుగుతున్నాయి...! వేల కోట్ల మొత్తంలో నల్లధనం బ్యాంకులకు జమ అవడాన్ని కూడా లెక్క తేల్చారు ఈమధ్యనే! ఈ ప్రక్రియ పూర్తయిన రోజున దేశంలో నిజాయితీగా జీవించే ప్రజలు తలెత్తుకునే పరిస్థితి వస్తుంది. ఇక ముసద్దీలాల్ విషయానికొస్తే గంటల వ్యవధిలోనే 5 వేల మంది తమ దుకాణాలకు వచ్చి ఏకంగా 340 కిలోల బంగారం కొన్నట్టు చూపి నకిలీ బిల్లులు సృష్టించారు. ఆ కస్టమర్లలో కొందరిని పోలీసులు ఆరా తీస్తే తాము అసలు ఆ దుకాణానికే వెళ్లలేదని చెప్పారు! రూ.97.85 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్‌లో పక్కా ఆధారాలు సేకరించిన నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్‌) అభియోపత్రాలు దాఖలు చేసింది. కేసులో మొత్తం పది మంది నిందితులతో పాటు మూడు కంపెనీలపై చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి బుధవారం వెల్లడించారు. గతేడాది నవంబర్‌ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడింది. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న ముసద్దీలాల్‌ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దీని అనుబంధ సంస్థలు ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల కేంద్రంగా బంగారం ‘విక్రయాలకు’స్కెచ్‌ రెడీ చేసింది. ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5,200 మంది వినియోగదారులు రూ.97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్‌ అడ్వాన్స్‌ పేమెంట్‌ రశీదులు సృష్టించారు. ఆ మొత్తాన్ని పంజాగుట్టలోని ఎస్‌బీఐ, బంజారాహిల్స్‌లోని యాక్సిస్‌ బ్యాంక్‌ల్లో డిపాజిట్‌ చేశారు. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ముఖ్యాంశాలు