రోడ్డు ప్రమాదంలో గాయపడిన గౌతమ్ మీనన్

ప్రముఖ సినీ దర్శకుడు గౌతమ్ మీనన్ మహాబలిపురం నుంచి చెన్నైకి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  శోలింగనల్లూరు సిగ్నల్ వద్ద ఆయన కారు ఒక టిప్పర్ ని ఢీకొంది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో గౌతమ్ మీనన్‌కు పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. గౌతమ్  ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

Facebook
Twitter