రామాలయ నిర్మాణానికి కరసేవకుల ప్రతిన


అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో రాజీకి తావు లేదని.. కచ్చితంగా రాముడు జన్మించిన ఆ పుణ్యభూమిలో అక్కడే ఆలయం నిర్మించాలని కరసేవకులు, విశ్వహిందు పరిషద్ జాతీయ కార్యదర్శి శ్రీ కె. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అయోధ్య కరసేవ రజతోత్సవ వేడుకలు శౌర్య దివస్ గా భీమవరంలోని త్యాగరాజ భవనంలో నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఆనాటి కరసేవలో వారి జ్ఞాపకాలని సభికులతో పంచుకున్నారు. ప్రస్తుతం అయోధ్య పరిస్థితిని, అక్కడి విశేషాలను అయన వివరించారు. ప్రజలకు వారి బాధ్యతలపై కర్తవ్యాన్ని నిర్దేశించారు. ఆనాటి అయోధ్య కరసేవలో పాల్గొన్న 98 మంది కరసేవకులు కూడా వారి అనుభవాలు, అనుభూతులని సభలో పంచుకున్నారు. శ్రీ రాముడు జన్మించిన అయోధ్యలోని అదేస్థలంలో రామ మందిరాన్ని కట్టి తీరుతామని ఈ సందర్భంగా అయోధ్య కరసేవకులు శపథం చేశారు. ఈ రజతోత్సవ వేడుకలు కేంద్ర-రాష్ట్ర సమన్వయ కర్త, పురిఘళ్ళ రఘురాం (ఢిల్లీ రఘు) సమన్వయంతో జరిగాయి. భారత దేశ చరిత్రలో ఈ సమారోహం ఒక చారిత్రాత్మక ఘట్టమని పలువురు అభివర్ణించారు.

ముఖ్యాంశాలు