అంబేద్కర్ పేరుతో ఓట్లడిగారు ...ఆయనను మరిచారు


అంబేడ్కర్‌ పేరుతో ఓట్లడిగే పార్టీలు జాతి నిర్మాణంలో బాబా సాహెబ్ అందించిన సేవలను తుడిచేయడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. దిల్లీ నడిబొడ్డులోని జన్‌పథ్‌లో నిర్మించిన అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. 23 ఏళ్ల కిందట తెరపైకొచ్చిన ఈ కేంద్రాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ హయాంలో ఎలాంటి ప్రయత్నం జరగలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక 2015 ఏప్రిల్‌లో శంకుస్థాపన చేశామని, ఇప్పుడు దీన్ని జాతికి అంకితమిస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్‌ పేరుతో ఓట్లు అడిగే పార్టీలకు ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉన్న విషయమే తెలియదన్నారు. శివ భక్తుడనంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను మోదీ ఎద్దేవా చేశారు. కులాల పేరుతో దేశంలో విభజనకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ కలలు కన్న సామాజిక ప్రజాస్వామ్యం ఇంకా నెరవేరలేదన్నారు. నేటి తరంలో పరిస్థితులు మారుతున్నాయి. సామాజిక రుగ్మతలు తొలగిపోతున్నాయి’’ అని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ ఆలోచనలు, బోధనలకు ప్రాచుర్యం కల్పించడానికి, సామాజిక ఆర్థిక అంశాలపై పరిశోధనకు ముఖ్య ప్రదేశంగాను ఈ అంతర్జాతీయ కేంద్రం వర్ధిల్లుతుందన్నారు. ఇది బౌద్ధం, ఆధునిక నిర్మాణరంగాల మేలి కలయికని చెప్పారు. దిల్లీ, ముంబయి, నాగ్‌పుర్‌, మౌ, లండన్‌లలో అంబేడ్కర్‌కు సంబంధించిన ఐదు యాత్రా ప్రదేశాలను తమ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం