మోదీ కి ముస్లిం మహిళల మద్దతు


భాజపా రాజకీయ చరిత్రలోనే ఇదొక కొత్త అధ్యాయం. మైనారిటీ లను తమ ఓటు బ్యాంకు లుగా భావిస్తున్న కొన్ని కుహనా రాజకీయ పార్టీలకు ఇదొక సంచలన వార్త. ముమ్మారు తలాక్‌పై కఠినచట్టం తెస్తున్నందుకు ప్రధాని మోదీకి అధికసంఖ్యలో ముస్లిం మహిళలు గురువారం కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ, వారణాసి, గోరఖ్‌పుర్‌లలో మోదీ చిత్రపటాలతో ఊరేగింపులు నిర్వహించారు. ఈ చట్టం తమ జీవితాల్లో మార్పు తెస్తుందని, హక్కులను పరిరక్షిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందేశం ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌కు వినిపిస్తుందని కూడా చెప్పారు. భవిష్యత్తు ఎన్నికల్లో తామంతా భాజపాకే మద్దతిస్తామని ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ముస్లిం మహిళలు ప్రకటించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం