అమిత్ షా రమ్మంటే రానని చెప్పా!


జనసేన పార్టీని వదిలేసి భాజపాలో చేరాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అడిగిగితే తాను మర్యాదపూర్వకంగా తిరస్కరించేసానని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చాలామంది తనను ఏం కావాలని అడిగారని, మంచిపాలన కావాలని వారందరికీ చెప్పానని పేర్కొన్నారు. సమాజం బాగుపడాలి అనే ఆలోచనే తనను రాజకీయాల్లోకి రప్పించిందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఒంగోలులోని ఏ1 ఫంక్షన్‌ హాల్‌లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్‌ చదువుతున్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నట్టు చెప్పారు. క్రమశిక్షణ, జవాబుదారీతనం, బాధ్యతతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పారు. కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తుంటే స్పందించిన పవన్‌ ‘మీరు సీఎం, సీఎం అంటే నేను అవను, పొంగిపోను అన్నారు. సీఎం కావడానికి చాలా అనుభవం కావాలన్నారు. అందరూ కలిసి పోరాడితేనే ప్రత్యేక హోదా సాధ్యమన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం