గుజరాత్ లో తొలిదశ పోలింగ్ ప్రారంభం


గుజరాత్‌ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఈ దశలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. గుజరాత్‌ సీఎం విజయ్‌ రుపాని, కాంగ్రెస్‌ నేత శక్తి సిన్హ్‌ గోహిల్‌ సహా మొత్తం 977 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇవాళ తేలనుంది. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయాల్సి ఉంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ సాగుతుంది. 14న మిగిలిన స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం 18న ఓట్ల లెక్కింపు జరుగుగుతుంది. ఈ దశకి సంబంధించి బిజెపి 89 , కాంగ్రెస్ 87 , బీఎస్పీ 64 , ఎన్సీపీ 48 , ఆప్ 21 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

ముఖ్యాంశాలు