చిత్రంగా మారిన చైనా చేష్టలు


ఈమధ్య చైనా చేష్టలు చిత్రంగా ఉన్నాయి. మిత్రదేశాలయిన ఉత్తర కొరియా, పాకిస్థాన్ పై చైనాకి ఏవైనా కొత్త అనుమానాలు, అభద్రతా భావన తలెత్తిందా అనే రీతిగా ఆ దేశం వ్యవహారశైలి కనిపిస్తోంది. ఇటీవల ఉత్తరకొరియా నుంచి అణుదాడులు జరిగితే ఎలా బయటపడాలనే విషయమై తన దేశ పౌరులకు సూచనలిచ్చిన చైనా ఇప్పుడు తాజాగా పాకిస్థాన్‌లో ఉంటున్న చైనీయుల పై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ప్రచారం మొదలెట్టింది. పాక్ లో ఉన్న చైనీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్రత లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు పనుల నిమిత్తం చైనాకు చెందిన వందలాది కార్మికులు, పలు కంపెనీల ఉద్యోగులు పాకిస్థాన్‌ వెళ్లారు. వారిపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు చైనా ఇప్పుడు అనుమానిస్తోంది. అంచేత వారికీ జాగ్రత్తలు చెబుతూ పాకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.

ముఖ్యాంశాలు