పవన్ ని చవట అన్న ఎమ్మెల్యే!


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. పవన్ తన అభిమాన హీరో అని, కానీ అయన ఇంత చవట అనుకోలేదని యాదవ్ ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం నెల్లూరులో మీడియా తో మాట్లాడారు. ప్రజారాజ్యం నుంచి బరిలో దిగిన చిరంజీవి ఎన్నికల్లో ఓడిపోగానే ఆయనను మోసం చేసిన తొలివ్యక్తి తమ్ముడు పవన్‌ కల్యాణేనని ఫిరాయింపులపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. "పవన్‌ రాజ్యాంగం గురించి, విలువల గురించి మాట్లాడతారు. కానీ, మా పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటుంటే మాత్రం మాట్లాడరు. అసలు పవన్‌కు నైతిక విలువలున్నాయా" అంటూ నిలదీశారు. ఒక హీరో ఇంతలా ఓ వ్యక్తి వెనకాల దాక్కుంటాడా? ఇంత అధైర్యస్తుడా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా తెచ్చే స్థాయి నాకు లేదు, నేను చిన్న వ్యక్తిని అంటున్న పవన్ ఏం నాయకుడు? ఇంకేమి సాధిస్తాడని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న నేత వైఎస్ జగన్ మాత్రం ముఖ్యమంత్రి కావాలని కోరుకోరాదు.. మీరంతా సీఎంలు అయిపోతారా? అని అనిల్ విమర్శించారు. ఏపీలో అవినీతి పై జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాని గురించి ఎందుకు పవన్ మాట్లాడరంటూ ధ్వజమెత్తారు.