శ్రీవారి దర్శనానికి సరికొత్త విధానం


తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి సరికొత్త విధానం అమల్లోకి రానుంది. ఈనెల 18 వ తేదీ నుంచి సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ విధానం అమలు చేయనున్నట్లు తితిదే జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేస్తామన్నారు. ఆధార్‌ అనుసంధానంతో టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తామని, టోకెన్లు పొందిన భక్తులకు 2-3 గంటల వ్యవధిలో స్వామివారి దర్శనం పూర్తవుతుందని తెలిపారు. డిసెంబరు 23 నుంచి జనవరి మొదటి వారం వరకు ప్రొటోకాల్‌ ఉన్న వారికే వీఐపీ దర్శనం టిక్కెట్లు జారీ చేస్తామని, సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ దర్శన టిక్కెట్ల జారీ నిలిపివేస్తామని అన్నారు. టైంస్లాట్‌ టోకెన్ల జారీకి 14 కేంద్రాల్లో 117 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ముఖ్యాంశాలు