ఆధార్ ఎక్కడ వాడారో తెలియాలా?


మొబైల్‌, పాన్‌, బ్యాంకు ఖాతా అన్నింటికీ ఆధార్‌ను అనుసంధానాన్ని తప్పనిసరి చేశారు. ప్రయాణాలకు దీన్ని గుర్తింపు కార్డుగా వాడుతున్నారు. అనేక సేవలకూ ఆధార్‌ను వినియోగించి ఉంటారు. అలా వినియోగించిన అనేకమందిలో ఉండే భయం, అనుమానం తమ ఆధార్‌ను ఎవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉందేమో అని! అనుమానం ఉన్నవారు తాము ఎప్పుడు, ఎక్కడ ఆధార్‌ను వినియోగించామనే విషయం తెలుసుకునేందుకు యూఐడీఏఐ ఓ సదుపాయాన్ని కల్పించింది. ఆ అనుమానం వస్తే వెంటనే ఆధార్‌ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో లాక్‌ చేసుకోవచ్చు కూడా. ఇందుకోసం తొలుత యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోని అథంటికేషన్‌ హిస్టరీ పేజీలోకి వెళ్లాలి. దాని లింక్‌:https://resident.uidai.gov.ఇన్ . ఆధార్‌ నెంబర్‌ను, సెక్యూరిటీ కోడ్‌ను నమోదుచేసి, జనరేట్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌కు ఓటీపీ నంబర్‌ వస్తుంది. దాన్ని వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేయాలి. ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఆధార్ వివరాలు కావాలో ఎంచుకుంటే తేదీ, సమయంతో సహా ఆధార్‌ ఇచ్చిన వివరాలను తెలుసుకోవచ్చు. గరిష్ఠంగా ఆరు నెలల క్రితం వరకు ఇచ్చిన వివరాలను ఇందులో చూడవచ్చు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం