ఆ టీచర్ ని రాజ్ నాథ్ ఏం చేసారంటే...!


విద్య, క్రమశిక్షణ నేర్పించిన ఉపాధ్యాయులను ఎన్నటికీ మరువకూడదని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వారే కారకులని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. లఖ్‌నవూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరైన సందర్భంగా అయన తన చిన్ననాటి గురువుతో పెనవేసుకున్న ఓ అనుభవాన్ని ఇలా వివరించారు. ‘నాకు ప్రాథమిక పాఠశాలలో మౌల్వి సాహెబ్‌ అనే పీఈటీ ఉండేవారు. పెద్దలతో క్రమశిక్షణగా ఎలా మెలగాలో ఆయన నాకు నేర్పించారు. నేను ఉత్తర్‌ప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు ఓసారి చందౌలికి సమీపంలోని నా స్వస్థలానికి వెళ్లాను. అప్పుడు నాకు స్వాగతం చెప్పడం కోసం పూలమాలతో రహదారి పక్కన నిలబడిన 90ఏళ్ల వృద్ధుడిని మా టీచర్చూ మౌల్వీ సాహెబ్ గా గుర్తుపట్టాను. వెంటనే కాన్వాయ్‌ ఆపించి, ఆయన దగ్గరకు వెళ్ళాను. నేనే ఆయనకు పూలమాల వేసి, పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకున్నాను’ అని చెప్పారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం