కొత్త పార్టీకి శరద్ గ్రూపు సన్నాహాలు


శరద్‌యాదవ్‌ నేతృత్వంలోని జేడీయూ తిరుగుబాటు వర్గం కొత్త పార్టీ స్థాపించనుంది. ఒకట్రెండు రోజుల్లో ఈసీకి దరఖాస్తు కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం చేయనున్నట్లు జేడీయూ మాజీ జనరల్‌ సెక్రటరీ, యాదవ్‌ సన్నిహితుడు అరుణ్‌కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సమాజ్‌వాదీ జనతాదళ్‌, లోక్‌తంత్రిక్‌ జనతాదళ్‌ అనే పేర్లతో ఈసీకి దరఖాస్తు చేస్తారు. జేడీయూ పార్టీ బాణం గుర్తును నితీశ్‌ వర్గానికి ఈసీ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త పార్టీ ఏర్పాటు శరద్ వర్గానికి అనివార్యం అయింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఎన్నికల గుర్తుపై శరద్ వర్గం కోర్టుని ఆశ్రయించింది కూడా. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జేడీయూ లేఖ రాసిన నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తాజాగా శరద్‌యాదవ్‌, ఆయన అనుచరుడు అలీ అన్వర్‌ లపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.

ముఖ్యాంశాలు