జనవరి 12  నుంచి నిరుద్యోగ భృతి!


జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే యువజనోత్సవం లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్నిప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఒక్కో నిరుద్యోగికి రూ.వేయి భృతిని అందజేయాలని ప్రతిపాదిస్తు న్నారు. రాష్ట్రంలో సుమారు 10లక్షల మంది నిరుద్యోగులుంటారని అంచనా వేసి రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలను బట్టి ఏడాదికి రూ.600 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. అమలుపై రాష్ట్రస్థాయిలో అపెక్స్‌ కమిటీ ఉంటుంది. ఆర్థిక, యువజన సేవలు, పంచాయతీరాజ్‌, ఐటీ, రవాణ, కార్మిక-ఉపాధికల్పన, వ్యవసాయం, విద్య, పశుసంవర్థక శాఖల మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా, నిరుద్యోగభృతి అమలు శాఖ ముఖ్యకార్యదర్శి సభ్య సమన్వయకర్తగా ఉండే ఈ కమిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీ జిల్లాలో శిక్షణ కేంద్రాలను ఎంపిక చేస్తుంది. భృతి ప్రకటన విడుదల చేసిన 15 నుంచి 21 రోజుల్లోపు నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్టీజీ) విభాగం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఏ రంగంలో సామర్థ్య పెంపు శిక్షణ అవసరమనేదీ నమోదు సమయంలో స్పష్టం చేయాలి. మొదట రాష్ట్రంలో ఉన్నంతమేర అవకాశం కల్పిస్తారు, తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాల కోసం శిక్షణనిస్తారు. ఒక సామాజిక కార్యక్రమాన్ని కూడా ఎంచుకోవాలి. అందులో స్వచ్ఛభారత్‌, వనం మనం, పర్యావరణ పరిరక్షణ, జలసంరక్షణ, సూక్ష్మ, చిన్న నీటిపారుదల, ప్రజారోగ్యం వంటివి ఉంటాయి. తర్వాత వారం నుంచి రెండువారాల్లో వారికి ఎక్కడ శిక్షణ ఇస్తారో ఆ సంస్థల వివరాలేమిటో జిల్లా ఉపాధికల్పనా కార్యాలయం సమాచారం అందజేస్తుంది.18-35 మధ్య వయస్సున్న నిరుద్యోగులు అర్హులు. ఇంటర్‌ లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యాంశాలు