పెద్ద ఎత్తున పాత నోట్ల స్వాధీనం


రద్దయిన పాత పెద్ద నోట్లను నిఘా అధికారులు గుజరాత్‌ లో భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. బారుచ్‌లో పాత రూ.500, 1000 నోట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ పట్టుకుంది. సుమారు రూ. 50 కోట్లవిలువ చేసే (ఇప్పుడు చెల్లనివి) పాత నోట్లను రికవరీ చేశామని డిఆర్ఐ అధికారులు ప్రకటించారు. యమునా బిల్డింగ్ మెటీరియల్ ప్రాంగణంపై దాడిచేసి అధికారులు ఈ పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ది డిప్యూటిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం రద్దయిన పాత కరెన్సీ నోట్లను కలిగి ఉండడం నేరమని అధికారులు పేర్కొన్నారు. ఉన్న పెద్ద నోట్లన్నీ బ్యాంకు లకి వచ్చేసాయి గదా.. ఇంకా బ్లాక్ మనీ ఎక్కడుంది? అసలు పెద్ద నోట్ల రద్దు ప్రయోగమే పెద్ద రంధ్రం అంటూ... తెగ గొణిగిన అపర ఆర్థిక శాస్త్రపితామహులు ఇవాళ గుజరాత్ లో దొరికిన యాభై కోట్ల పాత నోట్ల ను చూసి మొహాలు ఎక్కడ పెట్టుకోవాలి!! ఇది మాత్రమే కాదు.. ఏమో మోదీ ఓడిపోతే ఆ వచ్చేవాళ్ళు పాత నోట్లని మళ్ళీ బతికించేస్తారేమో అనే అనుమానం పుచ్చి... ఇంకా దింపుడు కళ్ళం ఆశ చావని అనేకమంది వందల కోట్ల పాత నోట్ల కట్టల్ని పూజిస్తూనే ఉన్నారు! ఇప్పటికీ అక్కడా... అక్కడా కోట్లాదిగా దొరుకుతూనే ఉన్నాయి! తమకి పనికిరావని తెలిసినా.. ఎవడికీ దానం చేసే గుణం కూడా లేని లోభులు ఇంకా లక్షల్లో ఉన్నారు! ఇలా దొరుకుతూనే ఉంటాయి! 2019 ఎన్నికలు కూడా అయ్యాకా... అప్పుడిక అన్ని అనుమానాలు తీరి.. ఆశలన్నీ చచ్చి... అప్పుడు చలిమంట వేసుకుంటారు ఆ నోట్లతో!