మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో


మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో మెగాస్టార్‌ చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్‌ హీరోగా త్వరలో ఓ సినిమా రానుంది. దీంతో మెగాభిమానులు తమ అభిమానం పంచాల్సిన హీరోల జాబితాలో ఇంకొకరు పెరిగారు. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి తో పాటు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగేంద్ర బాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఇంకా అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోలుగా, ప్రధాన నటులుగా ఉన్నారు. కాగా ఇపుడు కొత్తగా పరిచయం అయ్యే మెగా అల్లుడు కళ్యాణ్ చిత్రానికి రాకేశ్‌ శశి దర్శకత్వం వహిస్తారు. వారాహి చలన చిత్రం పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తారు.ఈ చిత్రంలో కల్యాణ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటించే అవకాశాలున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా కోసం కల్యాణ్‌ స్క్రీన్‌ టెస్ట్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలపై ఆసక్తి ఉన్న కళ్యాణ్ వైజాగ్‌లో శిక్షణ తీసుకున్నారని చెబుతున్నారు. ఇంతవరకు మెగా స్టార్, మెగా పవర్ స్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా ప్రిన్స్, మెగా బ్రదర్, ఇలాంటి మకుటాలు ఈ కాంపౌండ్ హీరోలకు ఉన్నాయి.. ఇప్పుడు మెగా అల్లుడి కోసం ఏమి బిరుదు పట్టుకొస్తారో చూడాలి.

ముఖ్యాంశాలు