మ్యాజిక్ చేస్తున్న మోదీ !


వాస్తవ అంశాల పైనుంచి జనం దృష్టి మరల్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ విమర్శించారు. మోదీ స్వగ్రామం వాద్‌నగర్‌లో జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. మెజీషియన్‌ ట్రిక్కులు ప్రదర్శించేటపుడు జనం చూపు మరలుస్తాడని... అలాగే మోదీ గత 15 రోజులుగా నిజాలను దాస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. మోదీ ప్రసంగాల్లో గుజరాత్‌ అభివృద్ధి విషయాలే కనిపించడం లేదని ఆరోపించారు. బీజేపీ వైఫల్యం సుస్పష్టంగా తెలుస్తుండడంతో అయ్యర్‌ ట్వీట్ల అంశాన్నిఎక్కువగా ప్రస్తావిస్తున్నారని తెలిపారు. నర్మదా జలాలను గ్రామాలకు తరలిస్తామని మోదీ హామీ ఇచ్చారని, అయితే ఆ నీళ్లు టాటాల ఫ్యాక్టరీకే వెళ్తున్నాయని రాహుల్ ఆరోపించారు,

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం