యుద్ధభూమిగా మారిన గాజా


ఇజ్రాయెల్‌ వాయుదళం టెర్రరిస్టు ఆక్రమిత ప్రాంతమైన గాజాపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడిలో అనేక తీవ్రవాద స్థావరాలు కూలాయి. దారుణమైన మిస్సైల్స్‌ ను ఎయిర్‌బేస్‌లపై ఇజ్రాయెల్‌ ప్రయోగించడంతో టెర్రరిస్టు గ్రూపు హమాస్‌ తేరుకోలేనం తగా దెబ్బతింది. శనివారం అర్థరాత్రి దాటాకా హమాస్‌ గ్రూపు మూడు క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ ముందే నేలకూల్చగా మరొకటి కొంతదూరం ప్రయాణించి దానికదే పడిపోయింది. కాగా ఇంకొకటి నగరాన్ని తాకింది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ గంటల వ్యవధిలోనే గాజాపై మిస్సైళ్ళతో దాడి చేసింది. కాగా ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల్లో ఇద్దరు హమాస్‌ తీవ్రవాదులు హతం కాగా 15 మంది గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘర్షణకు నేపథ్యం ఏమిటంటే... ప్రస్తుతం వెస్ట్‌బ్యాంక్‌ ఎక్కువ ప్రాంతం ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉంది. దీంతో ఇక్కడ జరిగే కార్యకలాపాల్ని, ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసనల్ని ఆ దేశం అణచివేస్తోంది. పైగా ఇక్కడ యూదుల సంఖ్య పెరుగుతోంది. గాజా మాత్రం హమాస్‌ ఇస్లామిక్‌ సంస్థ ఆధీనంలో ఉంది. గాజా, వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతాల పై ఆధిపత్యానికి ఇజ్రాయెల్, పాలస్తీనాలు పరస్పరం పోరాడుతున్నాయి.

ముఖ్యాంశాలు