12 న విరాట్, అనుష్కల పెళ్లి

కోహ్లి–అనుష్కల పెళ్లి పుకార్లతో ఈమధ్య మీడియా దద్దరిల్లిపోయింది. ఎంత ప్రచారం జరిగినా వీళ్లు అదేమీ లేదన్నారు. ఎయిర్ పోర్టుల్లో కూడా మీడియా వెంటాడినా నో నో అన్నారు. అయితే మొత్తానికి ఆ ప్రచారమే నిజమైంది. ఈ నెల 12 వ తేదీ మంగళ వారం ఇటలీలోని టస్కనీ లో ఉన్న ఓ రిసార్ట్‌లో వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది. అక్కడి రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితు లు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరవుతున్నారు. డిసెంబర్‌ 26న ముంబైలో రిసెప్షన్‌ వేడుక ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి  క్రికెటర్లకు, బాలీవుడ్‌ స్టార్లకు, ఇతర ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. రిసెప్షన్‌ మర్నాడే భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. 

Facebook
Twitter