12 న విరాట్, అనుష్కల పెళ్లి


కోహ్లి–అనుష్కల పెళ్లి పుకార్లతో ఈమధ్య మీడియా దద్దరిల్లిపోయింది. ఎంత ప్రచారం జరిగినా వీళ్లు అదేమీ లేదన్నారు. ఎయిర్ పోర్టుల్లో కూడా మీడియా వెంటాడినా నో నో అన్నారు. అయితే మొత్తానికి ఆ ప్రచారమే నిజమైంది. ఈ నెల 12 వ తేదీ మంగళ వారం ఇటలీలోని టస్కనీ లో ఉన్న ఓ రిసార్ట్‌లో వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది. అక్కడి రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితు లు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరవుతున్నారు. డిసెంబర్‌ 26న ముంబైలో రిసెప్షన్‌ వేడుక ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి క్రికెటర్లకు, బాలీవుడ్‌ స్టార్లకు, ఇతర ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. రిసెప్షన్‌ మర్నాడే భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us