డోక్లాం వద్ద మళ్ళీ చైనా బలగాలు


డోక్లాం వద్ద మళ్లీ పరిస్థితి జటిలంగా మారుతోంది. అక్కడ చైనా బలగాలు భారీగా మోహరించాయి. దాదాపు రెండు వేలమందితో కూడిన చైనా బలగాలు అక్కడ క్యాంప్‌ ఏర్పాటు చేసుకున్నాయి. గడ్డ కట్టే చలి ఉన్నప్పటికీ రెండు హెలిప్యాడ్లు, గుడిసెలు, స్టోర్లు ఏర్పాటు చేసుకుని చైనా సైన్యం అక్కడ బస చేసింది. ఇక్కడ ఉన్న భారత సైన్యం కంటే ఈ సైన్యం జనాభా మూడింతలు పైగా ఎక్కువ. ఇక డొక్లాం దక్షిణ ప్రాంతమైన ఝంపేరి రిడ్జ్‌ దగ్గర చైనా ఆర్మీ మోహరించిందని భారత సైన్యం ధృవీకరించింది. ఈ విషయంపై చైనా మరో కథ చెబుతోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా సైన్యం) ఏటా వేసవి, శీతాకాలాల్లో ఇక్కడ క్యాంపులు నిర్వహించటం సహజమని, ప్రస్తుత క్యాంపు అదేనని అంటున్నది. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న భారత సైన్యం అప్రమత్తం అయింది. సిక్కిం-భూటాన్‌-టిబెట్‌ ట్రై జంక్షన్ అయిన డోక్లాం వద్ద 73 రోజులపాటు భారత్‌-చైనా సైన్యాల మధ్య కొన్ని నెలల క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

ముఖ్యాంశాలు