న్యూయార్క్ టైమ్‌స్క్వేర్ వద్ద బాంబు పేలుడు

న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్టు తెలుస్తోంది. మాన్‌హట్టన్ పోర్టు అథారిటీ బస్సు టెర్మినల్ వద్ద ఈ ఘటన జరగడంతో పరిసర ప్రాంతాల ప్రజల్ని పోలీసులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పేలుడు సమయంలో బస్సు టెర్మినల్ వద్ద ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అమెరికాలో అతిపెద్ద పోర్టు అథారిటీ బస్సు టెర్మినల్ ఇదే.