న్యూయార్క్ పేలుడు ఆత్మాహుతి దాడే


మాన్‌హట్టన్‌ 42వ వీధి, ఎనిమిదో అవెన్యూ బస్‌ టెర్మినల్‌ వద్ద పేలుడు సంభవించగానే ఒక వ్యక్తి గాయాలతో పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అతని పొట్ట భాగంలో వేసుకున్న జాకెట్‌లో వైర్లు ఉండటాన్ని గమనించారు. బాంబ్‌ స్క్వాడ్ సాయంతో అతని ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అఖాయెద్‌ ఉల్లాగా గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇతను ఏడేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నా డు. ఐసిస్‌ వలన ప్రేరణ పొంది యితడు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఎన్‌వైపీడీ (పోలీస్) వర్గాల కథనం ప్రకారం అఖాయెద్‌ తాను పనిచేస్తున్న ఎలక్ట్రిక్‌ కంపెనీలోనే పైప్ బాంబును తయారుచేశాడు. ఈ పైప్‌ బాంబును రద్దీగా ఉండే చోట దానిని పేల్చడం ద్వారా కలకలం రేపాలని భావించాడు. పథకం ప్రకారం సోమవారం ఉదయమే జాకెట్‌ కుడి జేబులో బాంబును పెట్టుకుని బస్‌ టెర్మినల్‌ వద్దకు చేరుకున్నాడు. అయితే అనుకున్నవిధంగా బాంబును పేల్చలేకపోయాడు. దీంతో స్వల్ప పేలుడు మాత్రమే వచ్చింది. అఖాయెద్ ఉల్లా జాకెట్‌, దుస్తులు, పొట్టభాగంలో కుడివైపు కాలిపోయాయి. అతడితో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. అనుకున్నట్టే ఈ పైప్ బాంబ్ పేలి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించేది అని పోలీసులు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం