మరో రెండేళ్లు ఆర్ధిక వ్యవస్థ ఇంతే !


పెద్ద నోట్ల రద్దు, వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుతో పాటు బ్యాంకుల్లో పేరుకుపోయి న మొండిబకాయిల వలన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని, ఇది మరో రెండేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి అన్నారు. అయితే ఆ తర్వాత దేశ ఆర్ధిక రంగం అధిక వృద్ధి బాటలోకి పయనిం చవచ్చని అయన అంచనా వేశారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధి రేటు అంచనాలను వెల్లడించడం కష్టసాధ్యమైన విషయం అన్నారు. మళ్లీ భారత ఆర్థిక వ్యవస్థ 7.5–8 శాతం వృద్ధిని ఎప్పటికల్లా అందుకుం టుందనేది చెప్పలేమన్నారు. అయితే వచ్చే రెండేళ్లలో మాత్రం ఇది సాధ్యం కాదని స్పష్టం చేసారు. డీమోనిటైజేషన్ షాక్‌ కారణంగా వృద్ధిలో మందగమనం ఏర్పడిందని, అయితే దీనిలో లాభాలు కూడా ఉన్నాయని తెలిపారు. దీని ప్రయోజనాలు భవిష్యత్తులో లభిస్తాయి.. అయితే ఇవి ఏమేరకు ఉంటాయనేది ప్రధానమైన అంశం’ అని రెడ్డి వ్యాఖ్యానించారు.

ముఖ్యాంశాలు