
గుజరాత్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కి ఒక విచిత్ర అనుభవం ఎదురైంది. ఖేదా జిల్లాలోని శ్రీ రంఛోడ్‌జీ ఆలయాన్ని ఆయన దర్శించుకున్న సమయంలో.. పూజా కార్యక్ర మాలు ముగించుకొని తిరిగి వస్తున్న రాహుల్ వద్దకు ఓ చిన్నారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రత్యేక భద్రతా సిబ్బంది ఆ బాలుడిని ఆపేందుకు ప్రయత్నించగా రాహుల్ వారించారు. ఆ బాలుడు దగ్గరకు రాగానే రాహుల్ ఆత్మీయంగా ఎత్తుకున్నారు. బాలుడు రాహుల్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అతడితో రాహుల్ కొద్ది సేపు సరదాగా మాట్లాడారు.