ఎన్ఐటి భవనాల నిర్మాణానికి నిధులు కోరిన పైడికొండల


కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను ఏపీ దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కలిశారు. వారిద్దరి సమావేశం అనంతరం మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం ఎన్ఐటికి శాశ్వత భవనాల నిర్మాణానికి నిధుల సమస్య రాకుండా చూడాలని కేంద్రమంత్రిని కోరానని తెలిపారు. అలాగే ఎన్‌ఐటీకి డైరెక్టర్‌ని నియమించాలని కోరామన్నారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ ఏపీలో ఏర్పాటు చేస్తున్న కేంద్ర విద్యాసంస్థలకు వసతులను సకాలంలో సమకూరుస్తామని, ఇందుకు ప్రత్యేక ఆర్థిక సంస్థ ద్వారా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఆర్థిక సంస్థకు తిరిగి కేంద్రమే చెల్లింపులు చేస్తుందని కూడా జవదేకర్‌ స్పష్టం చేశారు.

ముఖ్యాంశాలు