కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ ఏకగ్రీవ ఎన్నిక

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి నామినేషన్‌ తిరస్కరణ గడువు సోమవారంతో ముగిసింది. రాహుల్‌ మినహా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ ఎం. రామచంద్రన్‌ ప్రకటించారు. డిసెంబర్‌ 16న రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు డిసెంబర్‌ 16న రాహుల్ పార్టీ బాధ్యతలు తీసుకుంటారు. 2004లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాహుల్‌ అప్పటి నుంచి వివిధ విభాగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2007లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను రాహుల్  నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. 19 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న సోనియా గాంధీ ఈ నెల 16న జరిగే కార్యక్రమంలో ఆ బాధ్యతలను తనయుడు రాహుల్‌గాంధీకి అందించనున్నారు. రాహుల్ రాజకీయాల్లోకి వచ్చి 13ఏళ్లయింది. 132ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పాటయింది. అప్పటి అధ్యక్షులు ఉమేశ్‌ చంద్ర బెనర్జీ. ఆ తర్వాత దాదాబాయి నౌరోజీ ఆ బాధ్యతలు చేపట్టారు. మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌, అబుల్‌ కలాం ఆజాద్‌ లాంటి స్వాతంత్య్ర సమరయోధులు కూడా పార్టీని నడిపించారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ పార్టీకి సోనియా వరకు 15 మంది అధ్యక్షులుగా వ్యవహరించారు. రాహుల్‌ 16వ అధ్యక్షుడిగా 16  న బాధ్యతలు చేపట్టనున్నారు. స్వరాజ్యనంతరం పార్టీ పగ్గాలు మోసిన 15 మంది అధ్యక్షులలో నెహ్రు కుటుంబీకులే నలుగురు.. అది కూడా ఏకంగా దాదాపు నలభై ఏళ్ళ పాటు అధ్యక్షులుగా ఉన్నారు. అత్యధిక కాలం సోనియా ఈ పదవి వహిస్తే, ఇందిరా, రాజీవ్ ఎనిమిదేసి సంవత్సరాలు, నెహ్రు మూడేళ్లు ఈ పదవిలో ఉన్నారు. నెహ్రు ఫామిలీ నుంచి ఈ పదవి చేపడుతున్న వారిలో రాహుల్ ఐదో వ్యక్తి. పట్టాభి సీతారామయ్య,  పురుషోత్తం దాస్‌ టాండన్‌, యు.ఎన్‌ దేవర