నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య

తిరుపతిలోని శ్రీధర్‌ బికోత్తకోట నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన  వివరాలు ఇలా ఉన్నాయి. సెకండియర్‌ చదువుతున్న హర్ష అనే విద్యార్థి హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. విద్యార్థి సంఘాలు రుయా ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగాయి. హర్ష మృతికి నారాయణ కాలేజీ యజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. తక్షణమే కాలేజీని మూసివేయాలని డిమాండ్‌ చేశాయి. 

Facebook
Twitter