పేరు ఆజాద్... తీరు అక్రమం


ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం వేకువజాము నుంచి తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు ఏకకాలంలో అనేకచోట్ల సోదాలు చేపట్టారు. చంద్రశేఖర్ నివాసాలతో పాటు యనమల కుదురులోని ఆయన సోదరుడు వివేకానంద ఇల్లు, ఇతర బంధువుల, సన్నిహితుల ఇళ‍్లలో కూడా తనిఖీలు సాగుతున్నాయి. రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, నూజివీడు, హైదరాబాద్, అనంతపురం జిల్లా ఊబిచర్ల ప్రాంతాలలో ఇవి జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 18 చోట్ల, 21 బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆస్తులు, బంగారు ఆభరణాలు, నగదు పెద్దఎత్తున బయటపడుతున్నాయి. చంద్రశేఖర్ ఆజాద్ ప్రస్తుతం రాజమహేంద్రవరంలో విధులు నిర‍్వహిస్తున్నాడు. ఈ ప్రబుద్ధుడు కాకినాడ కేంద్రంగా ఉన్న ఆర్ జేసీ కార్యాలయాన్ని తనకు అనుకూలంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసుకుని అక్రమాల దందా చేపట్టాడు. ఏలూరు పత్తేబాద్‌ సమీపంలో బినామీ పేర్లతో 6 ఎకరాల విలువైన స్థలాన్ని ఇతగాడు కొనుగోలు చేసాడు. విజయవాడ పడమట సమీపంలో విద్యుత్‌ కాలనీలో కుటుంబ సభ్యుల పేరున కోట్ల రూపాయిల విలువ చేసే అయిదు అంతస్తుల భవనం ఉంది. గొల్లపూడిలో కోటిన్నర రూపాయిలతో 500 గజాలలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనం గృహ ప్రవేశానికి సిద్ధమైంది. అనంతపురం జిల్లా కదిరిలో కుటుంబ సభ్యుల పేరున 32 ఎకరాలలో అబేధ్య పేరుతో సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటైంది. దీనిపై రూ.15 కోట్ల రుణం తీసుకున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us