భోజనం ఖర్చుపై అనుచిత ఆరోపణలు


పఠాన్‌ జిల్లాలోని రాధన్‌పూర్‌ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్‌ ఠాకూర్‌ ఒక సభలో మాట్లాడుతూ మోదీ భోజనం ఖర్చులు, శరీరం రంగు గురించి ఆరోపణలు చేసారు. "ప్రధాని మోదీగారు తైవాన్‌ నుంచి తెప్పించే పుట్టగొడుగులు(మష్రూమ్స్) తింటారు. ఒక్కోటి రూ.80 వేలు ఖరీదైన మష్రూమ్స్ రోజుకు ఐదు తింటారు. అంటే ఆయన భోజనం ఖర్చు రోజుకు రూ.4లక్షలు... ప్రధానిగారే అంత తింటుంటే.. సాధారణ బీజేపీ కార్యకర్తలు ఎలా ఉంటారో ఊహించుకోవచ్చు’’ అని అల్పేశ్‌ అల్పమైన ఆరోపణలు చేసారు. ఒకప్పుడు మోదీ.. నల్లగా ఉండేవారు. కానీ ఇప్పుడాయన నిగనిగలాడే టమాటా పండులా తయారయ్యారు. మష్రూమ్స్‌ తినడం వల్లే ఆయన ఒంటికి రంగుపట్టింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన ఇవి తింటున్నారని తెలిసింది... అని అల్పేశ్‌ అన్నారు. ఈ ఆరోపణలపై ఇపుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. శరీరం రంగును తక్కువచేసి మాట్లాడటం, తిండి ఖర్చుపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం