రహస్యంగా రోడ్లు వేస్తున్న చైనా


భారత్‌ చైనాల మధ్య ఉన్న మూడు దేశాల కూడలి ప్రాంతం డోక్లామ్‌ వద్ద చైనా పన్నిన కుట్ర ఉపగ్రహ చిత్రాల ద్వారా బయటపడింది. చైనా దొంగచాటుగా డోక్లామ్‌ వివాదాస్పద ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టిన వైనం ఈ చిత్రాలతో వెలుగు చూసింది. రెండు వైపుల రోడ్డు విస్తరించుకుంటూ వెళుతున్న వ్యవహారం బట్టబయలైంది. 13 నెలల కిందట శాటిలైట్‌ ద్వారా చిత్రించిన చిత్రాలకు ఇప్పటికీ చిత్రాలకు పోల్చి చూడగా కొత్తగా చైనా రోడ్డు నిర్మాణ పనులను డోక్లామ్‌లో మొదలు పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అది కూడా అక్బోబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 8 మధ్యలోనే ఈ నిర్మాణాలు జరిగాయని అధికారులు భావిస్తున్నారు. డోక్లామ్‌ విషయంలో భారత్‌ చైనాకు మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తీవ్ర వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దాదాపు 70 రోజుల పాటు ఇరు దేశాల సైన్యం మధ్య తీవ్ర సంఘర్షణ నెలకొంది. కడకు రాజీ కుదిరి గొడవ సర్దుమణిగింది. అయితే శాటిలైట్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన చిత్రాలను పరిశీలించగా చైనా రెండు రోడ్లు కొత్తగా నిర్మించిందని, అందులో ఒకటి ఒక కిలోమీటర్‌ కాగా మరొకటి 4.5 కిలోమీటర్లు(ఇది డోక్లామ్‌కు అతి సమీపంలో ఉన్నది) అని తేలింది.

ముఖ్యాంశాలు