విరాట్ కోహ్లీ - అనుష్క ల వివాహం


భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ వివాహం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఇటలీలోని తాస్కానిలో గల ఓ రిసార్టులో జరిగింది. 2013లో ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌ సందర్భంగా కలిసిన కోహ్లీ, అనుష్క కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. జనవరి 4న ముంబయిలోని బాంద్రా కుటుంబ కోర్టులో పెళ్లి రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని తెలిసింది. ఇటలీలో కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఒక్కటైన ఈ జంటఈ నెల 21న దిల్లీలో, 26న ముంబయిలో వివాహ విందు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us