గుజరాత్‌ తుది పోరుకు సర్వం సిద్ధం


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తుది పోరు(రెండో దశ)కు సర్వం సిద్ధమైంది. 93 నియోజకవర్గాల్లో గురువారం వీటిని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రచార తంతు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. భాజపా తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా అగ్రనేతలు, కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీతోపాటు సీనియర్‌ నాయకులు హోరాహోరీ ప్రచారం చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లోని 14 జిల్లాల్లో జరుగబోతున్న ఈ దశ ఎన్నికల్లో.. బీఎస్పీ (75 మంది), అఖిల భారత హిందుస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఏఐహెచ్‌సీపీ- 46 మంది), ఎన్సీపీ (28 మంది) సైతం తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 350 మంది స్వతంత్ర అభ్యర్థులు, 168 మంది ఇతరులు ఈ సారి పోటీలో నిలబడుతున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం