చిరంజీవి వంద ఇస్తే వద్దన్న పసుపులేటి

దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితంపై సీనియర్‌ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రచించిన  ‘తెర వెనుక దాసరి’ పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి, నటుడు చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి సినీ పరిశ్రమ కు చేసిన సేవలను కొనియాడారు. చిత్ర పరిశ్రమకు రావాలి అనుకునే వారికి ఈ పుస్తకం ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు దాసరి చిరస్మరణీయు డని ఆయన అన్నారు.  ఈ పుస్తకాన్ని రాసిన రామారావు మట్టిలో మాణిక్యం అన్నారు చిరంజీవి. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పటి నుంచి రామారావుతో తనకు పరిచయం ఉందన్నారు. పసుపులేటి తన గురించి ఓ ఆర్టికల్‌ రాసినప్పుడు అది చూసి చాలా ఆనందపడ్డానని, అప్పుడు రామారావును పిలిపించి రూ.100 ఇస్తే వద్దని తిరస్కరించారని గుర్తు చేసుకున్నారు.

Facebook