చిరంజీవి వంద ఇస్తే వద్దన్న పసుపులేటి


దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితంపై సీనియర్‌ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రచించిన ‘తెర వెనుక దాసరి’ పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి, నటుడు చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి సినీ పరిశ్రమ కు చేసిన సేవలను కొనియాడారు. చిత్ర పరిశ్రమకు రావాలి అనుకునే వారికి ఈ పుస్తకం ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు దాసరి చిరస్మరణీయు డని ఆయన అన్నారు. ఈ పుస్తకాన్ని రాసిన రామారావు మట్టిలో మాణిక్యం అన్నారు చిరంజీవి. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పటి నుంచి రామారావుతో తనకు పరిచయం ఉందన్నారు. పసుపులేటి తన గురించి ఓ ఆర్టికల్‌ రాసినప్పుడు అది చూసి చాలా ఆనందపడ్డానని, అప్పుడు రామారావును పిలిపించి రూ.100 ఇస్తే వద్దని తిరస్కరించారని గుర్తు చేసుకున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us