రామ సేతు సత్యం.. అది మానవ నిర్మితం


రామసేతు కచ్చితంగా ప్రకృతి సిద్ధం కాదని, అది ముమ్మాటికీ మానవ నిర్మితమేనని అమెరికాకు చెందిన ఒక టెలివిజన్‌ సంస్థ స్పష్టం చేసింది. అసలు అలాంటి నిర్మాణమే లేదని మూర్ఖంగా వాదిస్తున్న కొందరి నోళ్లకు ఈ టెలివిజన్ సంస్థ ప్రకటనతో తాళం పడుతుంది. కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు చెందిన ఓ సైన్స్‌ ఛానల్‌ భారత్ శ్రీలంక మధ్య సముద్రంలో ఉన్న రామసేతు పై పరిశోధనలు జరిపింది. తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలోని ధనుష్కోటి ప్రాంతానికి, శ్రీలంకలోని మన్నార్‌ ప్రాంతానికి మధ్య రాళ్లతో కూడిన నిర్మాణాన్ని ఏడు వేల సంవత్సరాల క్రితం మానవులు నిర్మించినట్టు ఈ పరిశోధన తేల్చింది. దీనికి సంబంధించిన ఒక ప్రోమోను కూడా ఆ టెలివిజన్ సంస్థ విడుదల చేసింది. సుమారు పదేళ్ల కిందట యూపీఏ ప్రభుత్వ హయాంలో రామసేతు మీదుగా సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదిం చింది. ఓడల ప్రయాణ కాలం, ఇంధనం ఆదా చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు కోసం రామసేతులో కొంత భాగాన్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఉండడంతో దేశవ్యాప్తంగా పలు హిందూ సంస్థలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసాయి. హిందువుల విశ్వాసం ప్రకారం సీతమ్మను రావణాసురుడు అపహరించి లంకలో బందీగా ఉంచుతాడు. హనుమంతుడు సగ్గరాన్ని లంఘించి లంకకు వెళ్లి సీతాదేవి జాడ తెలుసుకుని వస్తాడు. ఆ తర్వాత శ్రీరాముడు వానరుల సాయంతో రామేశ్వరం చేరుకుంటాడు. అక్కడ నుంచి లంకకు చేరడం కోసం వనరుల సహాయంతో రాముడు ఈ సేతు నిర్మాణం చేసినట్టు రామాయణం చెబుతోంది. ఈ సేతువు మీదుగానే శ్రీరాముడు, లక్ష్మణుడు, వానరులు లంకకు చేరి రావణుడితో యుద్ధం చేస్తారు. రావణ సంహారం తర్వాత సీతాదేవిని పుష్పక విమానంలో తీసుకు వచ్చేటప్పుడు శ్రీరాముడు ఈ సేతువును ఆమెకు చూపించినట్టు కూడా రామాయణంలో ఉంది. అయితే భారతీయుల దురదృష్టం ఏమిటంటే ఇక్కడ పాలకులు, కొన్ని రాజకీయ పార్టీలు దీనిని నమ్మకుండా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానాలు చేసి హిందువుల మనోభావాలను గాయపరుస్తూ వచ్చారు. సేతు సముద్రం ప్రాజెక్ట్ విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం (యుపిఎ సర్కారు) కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ భారతీయతకు విరుద్ధం. అసలు రాముడి ఉనికే ఉహాజనితం అన్నట్టుగా ఆ అఫిడవిట్ ఉండడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఇప్పుడు అమెరికా కు చెందిన సైన్స్‌ ఛానల్‌ దీనికి సంబంధించి స్పష్టమైన పరిశోధన చేయడం ఇది మానవ నిర్మితం అని ప్రకటించడం యుపిఎ నాయకులకు చెంపపెట్టు వంటిది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఇది ప్రకృతి సిద్ధం కాదని మానవ నిర్మితం అని తేలిందని ఆ ఛానల్ తెలిపింది. సముద్రంలోని ఇసుకపై రాతితో నిర్మాణాలు చేపట్టినట్టు ఈ పరిశోధనలో వెల్లడయిం ది. అయితే సాధారణ మానవులు ఇలాంటి నిర్మాణం చేయలేరని పురాతత్వశాస్త్రవేత్త చెల్సియా పేర్కొన్నారు. పురాణాల ప్రకారం రామసేతు సత్యమని కోట్లాది హిందువుల మనోభావాలకు అనుగుణంగా భాజపా గతంలోనే పేర్కొన్న విషయాన్ని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమెరికన్ ఛానల్త పరిశోధన తమ వాదన నిజమని తేల్చిందని అన్నారు. రామసేతు నిజం కాదని గతంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్నిగుర్తు చేస్తూ అది బాధ్యతరహితమని తప్పుబట్టారు. రామసేతు భారతీయ సంస్కృతిలో అంతర్భాగమన్నారు.