విశాఖ రైల్వే జోన్ పై నిర్ణయం ప్రభుత్వానిదే


విశాఖ రైల్వేజోన్‌ అంశంపై ప్రస్తుతానికి ఎటువంటి కదలిక లేదని రైల్వేబోర్డు ఛైర్మన్‌ అశ్వని లోహాని స్పష్టం చేశారు. బుధవారం విశాఖ రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన అనంతరం తూర్పు కోస్తారైల్వే జీఎం ఉమేష్‌సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే జోన్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని, దీనికి సంబంధించి రైల్వే బోర్డు వద్ద ఎలాంటి ప్రతిపాదనలు పెండింగ్‌లో లేవని ఆయన తేల్చి చెప్పారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు ఒడిశా అడ్డుపడుతోందా అని అదిరితే అదేమీ తమ దృష్టికి రాలేదన్నారు. కేకే లైనులో చిమిడిపల్లి-బొర్రా మధ్యలో రైల్వే వంతెన స్తంభం లోయలో ఉన్నప్పటికీ క్లిష్టతరమైన మరమ్మతును రైల్వే ఇంజినీర్లు ఒక సవాల్‌గా తీసుకుని 58 రోజుల్లో పూర్తి చేశారని తెలిపారు. విశాఖ జోన్‌పై రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తూర్పు కోస్తా రైల్వే జీఎం ఉమేష్‌సింగ్‌ అన్నారు. విశాఖ రైల్వే డివిజన్‌లో ప్రస్తుతం 40శాతం ఒడిశా, 10శాతం ఛత్తీస్‌గఢ్‌లు ఉన్నాయని, 50శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం