రాహుల్ గాంధీకి ఇసి నోటీసులు


ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను ఎన్నికల సంఘం (ఈసీ) రాహుల్‌ గాంధీకి బుధవారం షోకాజ్‌ నోటీసులిచ్చింది. గుజరాత్‌లో రెండో దశ శాసనసభ ఎన్నికలు గురువారంకాగా, ప్రచార సమయం ముగిసినా రాహుల్‌ బుధవారం టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ బీజీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో ఈసీ స్పందించింది. ఇంటర్వ్యూను ప్రసారం చేయడాన్ని తక్షణం నిలిపేయాలని కూడా టీవీ చానళ్లను ఈసీ కోరింది. చానళ్లు సహా చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారందరిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాల్సిందిగా గుజరాత్‌ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం