కాంగ్రెస్ లో రాహుల్ శకం ఆరంభం


కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్ శకం ఆరంభమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలను స్వీకరించారు. 19 ఏళ్ల పాటు అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగారు. నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టిన ఆరో వ్యక్తిగా రాహుల్‌ నిలిచారు. దిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా రాహుల్‌ బాధ్యతలను అందుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ధ్రువీకరణ పత్రాన్ని కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు రామచంద్రన్‌ చేతుల మీదుగా సోనియా సమక్షంలో రాహుల్‌ అందుకున్నారు. ఈ వేడుకకు సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రాహుల్‌ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్‌, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ సహా పలువురు సీనియర్‌ నేతలు రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. ఈ వేడుక సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం