సన్నీలియోని వస్తే చస్తాం


బాలీవుడ్‌ నటి సన్నీలియోనికి వ్యతిరేకంగా బెంగళూరులో ఆందోళనలు జరుగుతు న్నాయి. బెంగళూరు నూతన సంవత్సర వేడుకల్లో ఆమెతో సందడి చేయించాలని చేసిన సన్నాహాలపై కర్ణాటక రక్షణ వేదిక యువసేన సంఘం మండిపడుతోంది. సేన నగరంలోని మాన్యతా టెక్‌ పార్కు ఎదుట ఆందోళన చేపట్టారు. సన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ సంస్కృతిని అవమానించడమంటూ ఆమె ఫొటోలకు నిప్పంటించారు. నూతన సంవత్సర వేడుకను ఆపకపోతే యువసేన సంఘం కార్యకర్తలు డిసెంబరు 31న మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరీష్‌ మాట్లాడుతూ ‘సన్నీ పొట్టి దుస్తులు ధరించడాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఆమె చీర కట్టుకుని కార్యక్రమానికి వస్తే రమ్మనండి అన్నారు. సన్నీకి గతం బాగోలేదు. ఇలాంటి వారిని మేం ప్రోత్సహించం. డిసెంబరు 31న ఆత్మహత్యకు పాల్పడటానికి మేం ఏ మాత్రం సంకోచించడం లేదు’ అని స్పష్టం చేసారు. కార్యక్రమ నిర్వాహకుడు స్పందిస్తూ ఇది ఓ కుటుంబ వేడుక లాంటిదని, సన్నీ కన్నడ పాటకు డ్యాన్స్‌ చేయబోతున్నారని చెప్పారు. ‘బెంగళూరుకు చెందిన నాకు ఇక్కడి సంస్కృతి తెలియదా? అని ప్రశ్నించారు. సన్నీకి దీని కంటే పెద్ద ఆఫర్లు వచ్చినా ఆమె వాటిని కాదని బెంగళూరుకు రావడానికి ఒప్పుకుందని, ఆమెకి బెంగళూరు, హైదరాబాద్‌ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇది ఓ కుటుంబం వేడుక.. దీని వల్ల రాష్ట్ర సంస్కృతికి ఎటువంటి అవమానం జరగదు’ అని చెప్పారు.

ముఖ్యాంశాలు