పోలవరాన్ని పూర్తి చేస్తాం -యనమల


పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పోలవరంపై ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హోమియోపతి ఆస్పత్రిని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. జగన్‌ ఇచ్చే హామీలు ఎంతమేరకు నెరవేరుస్తాడో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.

ముఖ్యాంశాలు