కాంగ్రెస్‌ ముక్త భారత్‌ దిశగా... !

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త భారత్ పిలుపు నిజం అయిపోతుందా? ప్రస్తుత పరిస్థితి గమనిస్తే  కమలదళం దూకుడు కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఆందోళన కలిగిస్తుంది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి కేవలం ఏడు రాష్ట్రాల్లోనే భాజపా అధికారంలో ఉంది. మోదీ ప్రధాని అయ్యాకా ఇప్పటి వరకు జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయభేరి మోగిస్తూ ఉండడంతో భాజపా దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల సంఖ్య 19కి చేరింది. దిల్లీ, పంజాబ్‌ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇపుడు కమల వికాసం గోచరిస్తోంది. కాంగ్రెస్‌ ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుం టూ తన ఉనికిని పోగొట్టుకుంటూంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలో కూడా కాంగ్రెస్సే అధికారంలో ఉంది. జమ్ముకశ్మీర్‌, ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో భాజపా తన మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంది.
తమిళనాడులో ఏఐఏడీఎంకే, పశ్చిమ్‌బంగాలో తృణమూల్‌ కాంగ్రెస్‌, దిల్లీలో ఆమ్‌ఆద్మీ లాంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌, కర్ణాటక, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలలో అధికారంలో ఉంది. వచ్చే ఏడాది కర్ణాటక, మేఘాలయ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీపీఎం సారథ్యంలోని వామపక్ష కూటమి కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. రాజకీయ ఎత్తుగడలే కాకుండా, ఆర్థిక విధానాలు, సంస్కరణల ఫలితాల ద్వారా, అద్భుతమైన ఎలక్షన్ మేనేజ్ మెంట్ ద్వారా మోదీ భాజపాకు తిరుగులేని ఆధిక్యం సంపాదించి పెట్టారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భాజపాకు ఎదురుగాలి వీస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భాజపా భారీ మెజార్టీ సాధించింది. జీఎస్‌టీ అమలు తర్వాత జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ సత్తా చాటింది. దీంతో ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల సంఖ్య 19కి చేరింది. 2018లో జరిగే అ