గుజరాత్, హిమాచల్ లో బిజెపి జయభేరి

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లో భాజపా స్పష్టమైన ఆధిక్యం కనబరిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లోని మొత్తం 182 స్థానాల్లో భాజపా ఇప్పటికే 100కి పైగా స్థానాల్లో ఆధిక్యం లో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ మొత్తం 68 స్థానాల్లో 45 స్థానాల్లో గెలుపుదిశగా దూసుకుపోతోంది. గుజరాత్‌ ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడం, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వెలువడుతున్న ఫలితాలు కావడంతో గుజరాత్రా ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుజరాత్‌లో భాజపా వరుసగా ఆరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని చూడగా, రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రతిపక్ష పాత్రకు స్వస్తిపలికి అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ ప్రయాస పడింది. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో భాజపా కొద్దిగా వెనుకబడినా ఇతర ప్రాంతాల్లో ఆధిక్యంలో ఉంది.గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లు విస్తృతంగా ప్రచారం చేశాయి. భాజపా ప్రధాని మోదీ నేతృత్వంలో రంగంలోకి దిగగా, కాంగ్రెస్‌ను అన్నీ తానై రాహుల్‌గాంధీ నడిపించారు. మోదీ, అమిత్‌షా ద్వయం రామాలయం, గుజరాత్‌ ఎన్నికల్లో పాకిస్థాన్‌ జోక్యం వంటి అంశాలే అస్త్రంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అయితే గుజరాత్‌ అభివృద్ధిని భాజపా గాలికొదిలేసిం దని, రాష్ట్ర భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారిందని, కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనితో పాటు పటిదార్‌ రిజర్వేషన్‌, ఓబీసీ వంటి అంశాలతో పాటు, కుల సంఘాల అండతో భాజపాను ఎలాగైనా అధికారం నుంచి తప్పించా లనే లక్ష్యంతో కాంగ్రెస్‌ తీవ్ర కృషి చేసింది. హార్దిక్‌ పటేల్‌ నాయకత్వాన పటిదార్‌ల రిజర్వేషన్ల కోసం ఆందోళన సాగుతుండగా దానిని కాంగ్రెస్ హైజాక్ చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల కోసం అల్పేశ్‌ ఠాకూర్‌, దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ జిగ్నేష్‌ మెవాని భాజపాకు సవాల్‌ విసిరారు. మొత్తం రాష్ట్ర జనాభాలో పట