చైనా సరిహద్దులో సీఎం సోదరుడి గస్తీ


సుబేదార్ శైలేంద్ర మోహన్ ఎవరో తెలుసా? ఈ వ్యక్తి భారత సైన్యంలో సుబేదార్ హోదాలో ఉన్నారు... అందరితో పాటే సాధారణ జీవితం గడుపుతూ దేశ రక్షణ కోసం అహర్నిశలూ పని చేస్తున్నారు... ఈయన మరెవరో కాదు.. దేశంలోనే పెద్ద రాస్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి స్వయానా సోదరుడు. కోరుకుంటే పోస్టు మార్చుకుని సుఖపడగలరు... ఇంకా ఆశిస్తే విలాసవంతమైన జీవితాన్ని కూడా సొంతం చేసుకోగలరు.. కానీ ఆయన ఆర్మ్ సుబేదార్ గానే విధులు నిర్వర్తిస్తున్నారు. అది కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ వద్ద అత్యంత కఠిన పరిస్థితుల్లో ఆయన విధినిర్వహణ సాగుతున్నది. యోగి ఆధిత్యనాద్ సోదరులలొ అందరికంటే చిన్నవాడైన శైలేంద్రనాద్ ప్రస్తుతం “ఘర్వాల్ స్కౌట్ యూనిట్” లొ సుబేదార్ గా చైనా సరిహద్దు ప్రాంతమైన మానా బోర్డర్ వద్ద దేశ రక్షణ భాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది ఉత్తరాఖండ్ లొని భారతదేశ సరిహద్దుకు చిట్టచివరనున్న అతి చిన్న గ్రామం. 3,200 అడుగుల ఎత్తున పూర్తిగా పర్వతాలు నిండిఉన్న ప్రాంతం కావడంతొ ఇక్కడ చైనీస్ సైనికుల చొరబాట్లు ఏక్కువగా ఉంటాయి … ఎటునుంచయినా ఆపద వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ విధులు నిర్వర్తించే భారత సైనికులు సంవత్సరం పొడవునా 24 గంటల పాటు గస్తీ తిరుగుతూనే ఉంటారు.సరిహద్దుల వద్ద గస్తీ నిర్వహిస్తున్న శైలేంద్ర మోహన్ ను ఒక ఆంగ్ల ఛానల్ ప్రతినిధి పలకరించారు. ఆ సందర్భంగా శైలేంద్ర మాట్లాడుతూ ” ఇది మన మాతృభూమి, మన దేశాన్ని కాపాడుకొవడం కొసం ఏటువంటి త్యాగాలకైనా సిధంగా ఉండాలి. అందుకే సంవత్సరం పొడవునా ఇక్కడ గస్తీ నిర్వహిస్తుంటాము … ఇది మాకు ఒక చాలెంజ్ లాంటిది” అని సమాధానమిచ్చారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తరువాత కేవలం ఒకసారి మాత్రమే శైలేంద్ర మోహన్ ఆయనను కలిశారు. ఈ సంధర్బంగా యోగి ఆయనతో అన్న మాటలేమంటే.. "మనం కచ్చితంగా మాతృభూమి ఋణం తీర్చుకొవాలి. నీ సామర్ధ్యం ఉన్నంతవరకు దేశ సేవకు అంకితమైఉండు. ఒకరి సిఫార్సుల మీద ఆధారపడకుందా నీ శక్తి సమర్థతల పైనే నమ్మకముంచి పనిచెయ్యి” అని!

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం